వాహనదారులకు బిగ్ అలర్ట్.. అలా చేస్తే లైసెన్స్ క్యాన్సిల్

by Mahesh |
వాహనదారులకు బిగ్ అలర్ట్.. అలా చేస్తే లైసెన్స్ క్యాన్సిల్
X

దిశ, వెబ్ డెస్క్: పాత వాహనాల నెంబర్ పేట్లను మారుస్తున్న వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం TS ను TG గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంతమంది వాహనదారులు తమ నెంబర్ ప్లేట్‌లలో TSకు బదులు TG అక్షరాలను మారుస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన రవాణా శాఖ అధికారులు.. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే TG సిరీస్ వర్తిస్తుందని అన్నారు. ఎవరైన తమ పాత వాహనాలకు సొంతంగా నెంబర్ ప్లేట్లపై స్టేట్ కోడ్ TG గా మారుస్తే.. ట్యాంపరింగ్ గా భావించి.. రూల్స్ ప్రకారం.. నేరంగా పరిగణిస్తామన్నారు. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story