హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ : నేడు ఫ్లై ఓవర్లు క్లోజ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-18 08:53:41.0  )
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ : నేడు ఫ్లై ఓవర్లు క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘షబ్-ఏ-ఖాదర్’ జగ్నేకి రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గ్రీన్ ల్యాండ్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మంగళవారం రాత్రి మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే నెక్లెస్ రోడ్డు, పీవీఎన్ ఆర్ రోడ్డులో వాహనదారులకు అనుమతి నిరాకరిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

మరో వైపు ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ హైవే నుంచి వాహనాలను చెంగిచర్ల, చర్లపల్లి, ఎన్జీసీ వైపు మళ్లించనున్నారు. మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story