యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులకు BIG అలర్ట్

by GSrikanth |
యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులకు BIG అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆలయంలోనికి సెల్‌ఫోన్లు నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈవో భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బంది సైతం సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధించింది. భక్తులు తమవెంట తీసుకెళ్లే సెల్‌ఫోన్లు భద్రపరచుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.5ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

Advertisement

Next Story