- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 8 నుంచి ‘‘భూమి కారవాన్- 2’’ యాత్ర స్టార్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భూమి కారవాన్–2లో భాగంగా రైతుల న్యాయ అవసరాలు, వారి భూమి ఆకాంక్షలు తెలుసుకోవడం కోసం ఈ నెల 8న(సోమవారం) భువనగిరి నుంచి ఘనపూర్ వరకు యాత్ర చేపడుతున్నట్లు లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి దేశాయ్‌లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్ల అనుభవాల నేపథ్యంలో ఇప్పటి ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి మరోసారి భూమి కారవాన్ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భూదాన్ పోచంపల్లి నుంచి భూమి సునీల్ అద్వర్యంలో లీఫ్స్ సంస్థ తెలంగాణా భూమి కారవాన్ - 2ను ప్రారంభించిందన్నారు.
ఈ కారవాన్ ద్వారా రైతుల న్యాయ అవసరాలను తెలుసు కోవాలనుకుంటున్నాం. రైతులకు ఉచిత న్యాయ సేవలను అందించడం కోసం మరిన్ని మెరుగైన కార్యక్రమాలను రూపొందించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. రైతులను కలిసి భూ సమస్యల పరిస్కారానికి, మరింత మెరుగైన భూపరిపాలన కోసం ప్రభుత్వం ఇంకా ఏమి చెయ్యాలి? సాగుకు సంబంధించి రైతుల న్యాయ అవసరాలు ఏమిటి? అని అడిగి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. వాటి ఆధారంగా మరో సారి తెలంగాణ ప్రజల భూమి మానిఫెస్టోని రూపొందిస్తామన్నారు.
రూట్ మ్యాప్
లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు కారవాన్ 2 యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, రామకృష్ణాపురం, రామచంద్రాపూర్, చందుపట్ల, కుమ్మరిగూడేం, చాడ ముత్తిరెడ్డి గూడేం, ఆత్మకూర్, మోత్కూర్, తుర్కగూడేం, పెద్ద పడిశాల, వస్తకొండూర్, బండ్ల కొత్తపల్లి, కామారెడ్డి గూడెం, దేవరుప్పల, ధర్మాపురం, మైలారం, విస్నూర్, పాలకుర్తి, బమ్మెర, గూడూర్, ఇప్పగూడ, ఘనపూర్ వరకు కొనసాగుతుంది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు.