- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న సస్పెండ్.. 48 గంటల పాటు జైలులో ఉండటంతో వేటు
దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న(గతంలో ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ)ను సస్పెండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరు 48 గంటల పాటు జైలులో ఉండటంతో ప్రభుత్వం వీరిపై వేటు వేసింది. ఈ మేరకు ఈ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని గత వారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి వీరు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నారు. కాగా తిరుపతన్న, భుజంగరావులు ప్రస్తుతం కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.