Bhujanga Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావుకు షాక్.. మరో కేసు నమోదు

by Shiva |
Bhujanga Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావుకు షాక్.. మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్‌ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడైన మాజీ ఏసీపీ భుజంగ రావు (Bhujanga Rao)కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ స్థల వివాదంలో ఓ సెటిల్‌మెంట్‌లో ఆయన ఇన్‌‌వాల్వ్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాడు కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న భుజంగ రావు ఆ సెటిల్‌మెంట్ విషయంలో తమను బెదరించాడంటూ కొందరు ఇవాళ సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mohanty)ని ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై ఈవోడబ్ల్యూ (EOW) పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీపీ భుజంగరావు (Bhujanga Rao)కు ఇటీవలే నాంపల్లి కోర్టు (Nampally Court) మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరైంది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచివెళ్లరాదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసు‌లో భుజంగరావు A2గా ఉన్నారు. ఈ కేసులో ఆయనను పోలీసులు మార్చి 23న అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్పెషల్ ట్యాపింగ్ పరికరాలతో ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, మీడియా ప్రతినిధుల, రియల్టర్లు, జ్యువెలరీ వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed