Boga Shravani: నేడు బీజేపీలోకి భోగ శ్రావణి.. ఢిల్లీకి పయనం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-01 04:41:45.0  )
Boga Shravani: నేడు బీజేపీలోకి భోగ శ్రావణి.. ఢిల్లీకి పయనం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన శ్రావణి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో జాయిన్ కానున్నారు. కాగా ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ భోగ శ్రావణిని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం సోమవారం భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి రహస్య మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story

Most Viewed