బౌద్ధ మహాస్థూపానికి అంతర్జాతీయ స్థాయి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by M.Rajitha |
బౌద్ధ మహాస్థూపానికి అంతర్జాతీయ స్థాయి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని, భక్త రామదాసు ధ్యానమందిరాన్ని సందర్శించారు. క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి బౌద్ధ స్థూపాన్ని మరింత అభివృద్ది చేసేందుకు వెంటనే రోడ్ మ్యాప్ తయారు చేసి డీపీఆర్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నేలకొండపల్లి అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించిందని, విదేశీ పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే ఉందని అన్నారు. ఈ కేంద్రంలో మరిన్ని వసతులు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. భక్తరామదాస నివాస స్థలం, ధ్యాన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed