ఎంతమంది వచ్చిన నన్నేం చేయలేరు.. KCR వ్యాఖ్యలకు భట్టి స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |   ( Updated:2023-11-21 15:08:06.0  )
ఎంతమంది వచ్చిన నన్నేం చేయలేరు.. KCR వ్యాఖ్యలకు భట్టి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మధిరలో ఈ సారి భట్టి గెలిచేది లేదు.. ఆయన సీఎం అయ్యేది లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మధిర ప్రజలు చాలా చైతన్యవంతులు, మీరు ఎంతమంది వచ్చిన నన్ను ఏమీ చేయలేరని అన్నారు. కేసీఆర్ నాకు భయపడే మధిర నియోజకవర్గం మొత్తం దళిత బంధు ఇస్తానని అంటున్నాడన్నారు. మధిర మొత్తం దళిత బంధు ఇస్తానని ప్రకటించిన కేసీఆర్.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడటం సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్‌కు సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సీఎం ఎవరనేదానిపై సీఎల్పీలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో సుపారిపాలనను తీసుకురావడమే ఇందిరమ్మ రాజ్యమని అన్నారు.

Advertisement

Next Story