DCM : జార్ఖండ్‌ గెలుపు.. ఖమ్మం బిడ్డ ఢిల్లీ అడ్డా! ఎయిర్‌పోర్టులో భట్టికి ఘన స్వాగతం

by Ramesh N |
DCM : జార్ఖండ్‌ గెలుపు.. ఖమ్మం బిడ్డ ఢిల్లీ అడ్డా! ఎయిర్‌పోర్టులో భట్టికి ఘన స్వాగతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్‌లో (Jharkhand Elections) కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌మాణ స్వీకారం చేశాక.. ఢిల్లీలో జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో పాల్గొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా భ‌ట్టికి శనివారం (Rajiv Gandhi International Airport) శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ (T Congress) శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. విమానాశ్రయం నుంచి భట్టి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఖమ్మం బిడ్డ ఢిల్లీ అడ్డా అంటూ భట్టి అభిమానులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.జార్ఖండ్ శాస‌న‌స‌భ‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధిష్టాన న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ.. అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యానికి బ‌ల‌మైన పునాదులేసిన వ్యూహ చాణ‌క్యుడు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. అంటూ కాంగ్రెస్ నేతలు భట్టిని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed