Bhatti Vikramakra: జార్ఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటుపై భట్టి విక్రమార్క కీలక సమావేశం

by Prasad Jukanti |
Bhatti Vikramakra: జార్ఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటుపై భట్టి విక్రమార్క కీలక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఇండియా కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలను ఇండియా కూటమి దాటిపోయింది. దీంతో కాంగ్రెస్ (Congress) కీలక సమావేశం నిర్వహించింది. శనివారం ఉదయం జార్ఖండ్ కాంగ్రెస్ ఇంచార్జి గులాం అహ్మద్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు జార్ఖండ్ కు పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramakra), తారిఖ్ అన్వర్, కృష్ణ అల్లవూరితో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ రాజేష్ ఠాకూర్ హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. కాగా జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈసీ గణాంకాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు జేఎంఎం 28, కాంగ్రెస్ 15, బీజేపీ 27, ఆర్ జేడీ 5, సీపీఐ(ఎంఎల్), (ఎల్) 2, ఏజేఎస్ యూపీ 1, ఎల్ జే పీఆర్ వీ 1, ఇతరులు 2 చొప్పున విజయం సాధించారు. ఫలితాలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed