మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కు షాక్..

by Sumithra |
మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కు షాక్..
X

దిశ, మల్కాజిగిరి ; మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ కార్పొరేటర్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చేప్పి బీజేపీలో చేరారు. నేరెడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, పార్టీ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు ఆదివారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంఎల్సీ మల్కాజిగిరి ఇంచార్జి రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఏంపీ, మాజీ ఎమ్మెల్సీలు కార్పొరేటర్ కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ సిద్దాంతం మోడీ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు సాయి కిరణ్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, అక్రమ్ సాయి, శ్యామ్, రమేష్, రాజు, ఆల్బర్ట్, రాజ్, మోహిత్, అజయ్, జాన్, జోషియా, రమేష్, సురేష్, ప్రమోద్, గ్రీజ, ఉమారాణి, ఆకాంక్ష, కళా, లక్ష్మిలు పార్టీలో చేరారు.

Advertisement

Next Story