Bhatti: ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.. పరామర్శలో డిప్యూటీ సీఎం

by Ramesh Goud |
Bhatti: ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.. పరామర్శలో డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం వరద బాధితుల పరామర్శలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించిన ఆయన వరద వల్ల సంభవించిన విపత్తును ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అలాగే మరోసారి మున్నేరు ఉప్పోంగే అవకాశం ఉందని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు ఉంటే ముందుగానే సమాచారం అందించాలని, అధికారులు సహాయక చర్యలు అందిస్తారని తెలిపారు.

కాగా మున్నేరు నదికి మరో సారి వరద ముప్పు పొంచి ఉండటంతో డిప్యూటీ భట్టి విక్రమార్క నిన్న రాత్రి సమయంలో హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వెళ్లారు. నది వెంట నివసించే దన్వాయిగుడెం, రమణపేట్, ప్రకాశ్ నగర్, మోతి నగర్ సహా పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనంతరం భట్టి పునరావాస కేంద్రాలను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని తెలిపారు. అలాగే ఈ విపత్తు ముగిసిన వెంటనే అన్ని విధాల ప్రభుత్వం తరుపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండేలా మిగతా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed