- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ ట్విస్ట్.. CLP భేటీ కంటే ముందే డీకేను కలిసిన భట్టి, ఉత్తమ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీకి అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో పార్టీ సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్ ఎల్లాకు చేరుకుంటున్నారు. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. కీలకమైన సీఎల్పీ భేటీకి ముందే హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుండి వీరే సీఎల్పీ మీటింగ్ జరగనున్న ఎల్లా హోటల్‌కు బయలుదేరనున్నారు. అయితే, ముఖ్యమైన సీఎల్పీ భేటీ కంటే ముందే ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్‌ను భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి కలవడం హాట్ టాపిక్‌గా మారింది. వీరి భేటీకి గల కారణం ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎల్పీ భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా అనౌన్స్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న భట్టి, ఉత్తమ్ డీకేను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.