Viveka Murder Case: వైఎస్ భాస్కరరెడ్డికి వైద్య పరీక్షలు.. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం..!

by srinivas |   ( Updated:2023-04-16 15:23:28.0  )
Viveka Murder Case: వైఎస్ భాస్కరరెడ్డికి వైద్య పరీక్షలు.. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం..!
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనను కాసేపట్లో సీబీఐ కోర్టులో ప్రవేశ‌పెట్టనున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ ఎక్కువగా ఉండటంతో సెలైన్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. భాస్కర్‌రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంలో భాస్కర్‌రెడ్డి సోదరుడు మనోహర్‌రెడ్డి లోపలికి వచ్చేందుకు ప్రశ్నించగా అందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. సుమారు ఇంట్లోనే రెండు గంటలపాటు భాస్కర్ రెడ్డిని విచారించారు. అనంతరం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించి మెమోను సతీమణి లక్ష్మికి పి.జనార్థన్ రెడ్డికి అందజేశారు. భాస్కర్ రెడ్డిపై 130బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. భాస్కర్ రెడ్డిని అధికారులు కడపకు తరలించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అయితే వివేకా హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అనంతరం దూకుడు

రెండు రోజుల క్రితం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కి సన్నిహితుడిగా పేర్కొన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఉదయ్ కుమార్ రెడ్డి చెరిపివేశారని సీబీఐ ఆరోపించింది. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ ఈ అంశాలను పేర్కొంది. అనంతరం ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో ఈనెల 26 వరకూ రిమాండ్‌ విధించారు. ఉదయ్‌కుమార్‌ రెడ్డి తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Breaking: తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఆవేదనలో తనయుడు అవినాశ్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed