ఆరు గ్యారంటీలు: ఒక్కో స్కీమ్‌తో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

by GSrikanth |
ఆరు గ్యారంటీలు: ఒక్కో స్కీమ్‌తో ఎన్ని ఉపయోగాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. అధికారులు ఇవాళ్టి నుంచి గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో మొత్తం ఎన్ని ఉపయోగాలు చేకూరనున్నాయో ఒకసారి తెలుసుకుందాం.

ఆరు గ్యారంటీలు:

1. మహాలక్ష్మీ: మహిళలకు నెలకు రూ.2500 సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం.

2. రైతుభరోసా: ఎకరానికి రూ.15 వేల సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 అదనం, రూ.2 లక్షల రుణ మాఫీ.

3. గృహజ్యోతి: ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

4. ఇందిరమ్మ ఇళ్లు: అర్హులకు ఇంటి స్థలం+రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.

5. యువ వికాసం: విద్యార్థులకు రూ.5 లక్షల వడ్డీలేని రుణం.

6. చేయూత: వృద్ధులకు నెలకు రూ.4000 పెన్షన్, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్.

Advertisement

Next Story

Most Viewed