ఫిష్ ఫెస్టివల్ ప్రారంభం.. మృగశిర కార్తె విశిష్టత ఇదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-08 09:36:38.0  )
ఫిష్ ఫెస్టివల్ ప్రారంభం.. మృగశిర కార్తె విశిష్టత ఇదే!
X

దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 22 రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే గురువారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫెస్టివల్ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కూన రెల్లిపోతున్న కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను ఆదుకుంటుందన్నారు.

అందులో భాగంగానే మత్స్య కార్మికుల సంక్షేమ కోసం ఉచిత చేపల పిల్లల పంపిణీ చేస్తుందన్నారు. ఆ చేప పిల్లలను కార్మికులు పట్టుకొని విక్రయించుకొని జీవితాలను గడుపుతున్నారని అన్నారు అంతే కాకుండా మత్స్య శాఖ ఆధ్వర్యంలో కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 10 తారీకు వరకు కొనసాగుతుందని 9వ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకన్న జగదీశ్వర్ రెడ్డి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మొలుగురి వెంకయ్య సూపరిండెంట్ శ్రీనివాస్, ఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్ ఇతర మత్స్య శాఖ అధికారులు సిబ్బంది వివిధ సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మృగశిర కార్తె ప్రారంభం

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. రేవతి కార్తె వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తిలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

రోహిణి కార్తిలో రోడ్లు పగిలి ఎండలతో సతమవుతుంటారు. ఈ కార్తిలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తిలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటుంటారు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు.

మృగశిర కార్తె మొదటి రోజున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం , మెరుగు, అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. అంతేకాదు ఈ కార్తి రోజు చేపలు తప్పకుండా తింటారు.

ఈ కార్తె రోజుకు చేపలకు ఎందుకంత ప్రాముఖ్యత ..

మృగశిర కార్తె తర్వాత వర్షాలు మొదలవుతాయి. 15 రోజులపాటు ఈ కార్తె ఉంటుంది. కార్తె సందర్భంగా చేపలు తినడం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీనివల్ల గుండె జబ్బులు అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలుకానున్న నేపథ్యలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ సీజన్లో చాలామందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరము దగ్గు ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే పూర్వీకులు శాఖా పరమైన ఇంగువను బెల్లం కలుపుకుని ఉండలు ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో చింతచిగురులో పెట్టుకొని తినేవారు. మృగశిర కార్తె రోజున ఏ ఇంట చూసినా చేపల పులుసు చేపల కూర వంటకాలు కనిపిస్తుంటాయి.

Read more:

నేడు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి

గొంతులో చేప ముళ్లు ఇరుక్కుందా.. అయితే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే..!

Advertisement

Next Story

Most Viewed