ఛలో సెక్రటేరియట్‌కు బీసీ జనసభ పిలుపు.. హై టెన్షన్!

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-15 06:57:24.0  )
ఛలో సెక్రటేరియట్‌కు బీసీ జనసభ పిలుపు.. హై టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఛలో సెక్రటేరియట్‌కు బీసీ జనసభ పిలుపునిచ్చింది. నిరుద్యోగులకు మద్దతుగా సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఇక, బీసీ జనసభ పిలుపుతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మూడ విభాగాల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియేట్ నాలుగు గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. సెక్రటేరియేట్ పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల బస్సులు, ఐచర్‌లు, పెట్రోలింగ్ వాహనాలు, పోలీసుల ఉన్నతాధికారుల వాహనాలతో నిండిపోయాయి.

పోలీసుల మోహరింపు, మరో వైపు బీసీ జన సభ సభ్యులు సెక్రటేరియెట్‌కు చేరుకుంటుడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీసీ జన సభ నేత రాజారాంయాదవ్, సహా పలువురు ముఖ్య నేతలు సెక్రటేరియెట్‌కు నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది. సెక్రటేరియెట్ వద్ద పోలీసులు వాటర్ కెనాన్‌లను సైతం సిద్ధం ఉంచారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్‌లో ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. రోడ్లపై వస్తున్న వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. సాధారణ పౌరులుగా వచ్చి ఆందోళనకు దిగుతారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

Advertisement

Next Story