- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE మెయిన్ పరీక్షలో సత్తా చాటిన BC గురుకుల విద్యార్థులు
దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో నిర్వహించిన JEE మెయిన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. 92 మంది అబ్బాయిలు, 65 మంది అమ్మాయిలు JEE ఎంట్రెన్స్‌లో అర్హత సాధించారు. బాలుర విభాగంలో కే.నందు 94.06 శాతం మార్కులు సాధించగా డి.మనీష్ 92.20, ఎల్.గౌతమ్ 89.52, ఏ.రాము 89.32 శాతం మార్కులు సాధించారు.
మొత్తం 92మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో వి.శివాణి 89.38 శాతం మార్కులు సాధించగా ఎం.రజినీ 89.11శాతం మార్కలు సాధించింది. 30కి పైగా విద్యార్థులు 80శాతానికి పైగా మార్కులు సాధించగా మొత్తం 65 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మంచి మార్కులు సాధించి ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హత సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్, కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు అభినందించారు.