BC గురుకుల జూనియర్ కాలేజీల ఫలితాలు విడుదల

by GSrikanth |
BC గురుకుల జూనియర్ కాలేజీల ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను https://mjpabcwreis.cgg.gov.in/ పరిశీలించాలని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 208 కేంద్రాల్లో ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్షను నిర్వహించామన్నారు. ఈ ఎగ్జామ్‌లో మెరిట్ సాధించిన విద్యార్థుల వివరాలను ఆన్ లైన్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్ధులకు అలాట్ చేసిన కాలేజీల్లో ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని సైదులు పేర్కొన్నారు.

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఎంపీసీలో 8624, బైపీసీ లో 6463, ఎంఇసీలో 484, సీఇ సీలో 2676, హెచ్ ఇ సీలో 229 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులో బాలికల కోసం 9841, బాలుర కోసం 8635 కేటాయించగా, ప్రత్యేకంగా వృత్తి విద్యా కోర్సులు అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్ లో 19 సీట్లు, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కి 11 సీట్లు, కంప్యూటర్ గ్రాఫిక్స్ , యానిమేషన్ కు లో 35 సీట్లు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 76 సీట్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లో 92 సీట్లు, ఫిజియోథెరపీ లో 12 సీట్లు, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో 9 సీట్లు, టూరిజం ,హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ లో 19 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story