- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BC: అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం(తెలంగాణ State)లోని బీసీ(BCs)లకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్(Dedicated Commission) ప్రజలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తుందని, కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు(Boosani Venkateswara Rao) అన్నారు. సోమవారం మాసబ్ ట్యాంక్(Masab Tank) లోని సంక్షేమ భవన్(Welfare Bhavan) లోని కమిషన్ కార్యాలయంలో డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలను, సలహాలను, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని(Constitution) అనుసరించి, సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు మేరకు లోబడి రిజర్వేషన్ల అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బహిరంగ విచారణలో ప్రజల నుంచి ఎంతో విలువైన సమాచారం లభించిందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలతో ఈనెల 12న బహిరంగ విచారణను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు.
అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన బీసీ జాక్ ప్రతినిధులు మాట్లాడుతూ... బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. తమిళనాడు రాష్ట్ర మోడల్(Tamil State Model) ను అధ్యయనం చేయాలని, తమిళనాడులో 32శాతం ఉన్న రిజర్వేషన్లను 69 శాతానికి పెంచుకున్నారని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్(BC Decleration) లో ప్రకటించిన విధంగా, క్యాటగిరీ ప్రకారం కాకుండా బీసీ కులాలు ఇప్పటి వరకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా దూరంగా ఉన్నవారిని గుర్తించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో కులాల వారీగా లబ్ధిపొందిన వారు, పొందని వారిని గుర్తించాలన్నారు. బీసీ, ఎంబీసీ, సంచార జాతులను కలిపి రిజర్వేషన్లను 50 కిపైగా శాతానికి పెంచి అమలు చేయాలని కోరారు. 1994 నుంచి 2013 మధ్య కాలంలో బీసీలు రాజకీయంగా తీవ్ర సమస్యలను ఎదుర్కున్నారన్నారు. రాజ్యాంగ సవరణ చేయడంతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. లేదంటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని, బీసీలకు అన్యాయం జరగకుండా కమిషన్ తమ సమస్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని కోరారు.
13న రంగారెడ్డి జిల్లాలో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈనెల 13న రంగారెడ్డి(Rangareddy) జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బహిరంగ విచారణను నిర్వహిస్తుందని డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ అభిప్రాయాలను కమిషన్ కు తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక(Report) అందజేస్తామని తెలిపారు.