- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమస్కారం పెడుతున్నా.. దయచేసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయకండి.. బండ్ల గణేష్ సపోర్ట్
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మద్దతుగా నిలిచాడు. టికెట్ దక్కని చాలామంది నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోన్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా గాంధీభవన్ వద్ద నిరసనలు కూడా చేపడుతున్నారు. రేవంత్ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తోన్నారు. తమ వర్గం వారికే రేవంత్ టికెట్లు ఇప్పించుకుంటున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తోన్నారు. టికెట్ దక్కకపోవడంతో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా.. ఈ సందర్భంగా రేవంత్‌పై ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలకు బండ్ల గణేష్ పలు సూచనలు చేశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎవరూ మాట్లాడవద్దని, కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించాడు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని, దయచేసి ఎవరూ రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని తెలిపాడు. పార్టీ పెద్దలు అందరితో చర్చించి టికెట్లు కేటాయిస్తారని, రేవంత్ ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదని అన్నాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా అందరూ ముందుకు వెళ్లాలని, అధికారంలోకి వస్తే ఎన్నో పదవులు వస్తాయని సూచించాడు.
బండ్ల గణేష్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసినా.. మహాకూటమిలోని సీట్ల ఒప్పందంలో భాగంగా బండ్ల గణేష్‌కు సీటు దక్కలేదు. ఆ తర్వాత గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీని వీడారు. ప్రస్తుతం బయట నుంచి కాంగ్రెస్‌కు మద్దతిస్తూ వస్తోన్నాడు. ఈ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాడనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పోటీ చేయమని కోరిన మాట వాస్తవమేనని, కానీ తనకు పోటీ చేయాలనే ఆలోచన లేదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు.