బండి సంజయ్ పర్యటన : పలువురు నాయకుల అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-28 03:02:24.0  )
బండి సంజయ్ పర్యటన : పలువురు నాయకుల అరెస్ట్
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు, సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ముధోల్ తాలూకా నాయకులైన మోహన్ రావు పాటిల్, భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి కుంటాల పోలీస్ స్టేషన్‌కి తరలించారు. జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని అరెస్టు చేశారు. సోమవారం పార్టీలో చేరబోతున్న రామారావు పటేల్‌ని సైతం అరెస్టు చేసి బాసర పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సభ నిర్వహించి తీరుతామంటూ నాయకులు తెలిపారు. ఈ మేరకు నాయకులు ఇక్కడి పరిస్థితిని బండి సంజయ్‌కు ఫోన్ లో తెలిపారు. స్పందించిన బండిసంజయ్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన భయపడేది లేదని తెలిపినట్లు సమాచారం.



Read More...

'దిశ' స్పెషల్ ఇంటర్వ్యూలో సంచలనాలు బయటపెట్టిన Bandi Sanjay

Advertisement

Next Story

Most Viewed