- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలవాల్సిందే అంటూ పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో తెలంగాణ పొలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ఎవరైనా గెలుస్తామని చెబుతారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఓడిపోతామని చెబుతున్నారని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు ఇంకా యాత్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు వేరు వేరుగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని దీనిపై ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి వెళ్తుందని 119 నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులు తమకు ఉన్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ నిజాయితీపరుడు కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ ఇంకా ఈటల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ భయంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటి అవుతున్నాయని, ఎన్నికల వరకు తన్నుకుని ఆ తర్వాత కలిసిపోతాయని అన్నారు. వీళ్లు దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించారు. హోల్ సేల్ గా కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ లో చేరిందన్నారు. కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినా వాళ్లు తిరిగి బీఆర్ఎస్ లోకే వెళ్తారని విమర్శించారు.