దయచేసి రజాకార్ సినిమాకు మినహాయింపు ఇవ్వండి.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

by GSrikanth |
దయచేసి రజాకార్ సినిమాకు మినహాయింపు ఇవ్వండి.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ లేఖ రాశారు. రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని మంగళవారం రాసిన లేఖలో రిక్వెస్ట్ చేశారు. విద్యార్థుల కోసం రజాకార్ సినిమా ప్రత్యేక షోలు వేయించాలని కోరారు. కాగా, ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్‌లో చిత్రబృందంతో కలిసి బండి సంజయ్ రజాకార్ సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ ఈ చిత్రాన్ని చూసి ఒవైసీ పార్టీ ఎలాంటిదో తెలుసుకోవాలని హితవు పలికారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే తమ అభిమతం అని ప్రకటించారు. ఎంత ఖర్చైనా ధైర్యంగా చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డికి బండి సంజయ్ అభినందించారు. కాగా, యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి అనసూయ కీలక పాత్రలో నటించింది.

Advertisement

Next Story