- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bandi Sanjay: కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. బండి సంజయ్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కులగణన(Caste Census)కు బీజేపీ(BJP) వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు. ఆదివారం హన్మకొండ(Hanmakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలో బండి సంజయ్ పర్యటించారు. ఇటీవల పిడుగుపడి ఇల్లు దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు, ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ఆరు గ్యారంటీలు(Six Guarantees) ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్(BRS) హయాంలో కులగణన చేశారని.. మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో చేసిన సర్వేలోనే పూర్తి వివరాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర సర్వే రిపోర్ట్ ఈ ప్రభుత్వానికి అందలేదా? అని బండి సంజయ్ అడిగారు. ఈ ప్రభుత్వానికి నివేదక అందకపోతే కేసీఆర్(KCR) ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. గత ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.