తెలంగాణలో వర్షాలపై బండి సంజయ్ కీలక నిర్ణయం

by M.Rajitha |
తెలంగాణలో వర్షాలపై బండి సంజయ్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. తెలంగాణలోని ఈ విపత్కర పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగులో చిక్కుకు పోయిన వారి గురుంచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. కార్పెంటర్ పనులు చేసే 9 మంది వాగుపైన గల ప్రకాష్ బ్రిడ్జి వద్ద చిక్కుకు పోయారు. వీరిని రక్షించేదుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, హెలికాప్టర్లను తక్షణమే పంపించాలని కోరారు. అలాగే ఖమ్మంలో 110 గ్రామాలు పూర్తిగా వరదలో చిక్కుకుపోయాయని వివరించారు. మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ తెలిపారు. కాగా ఉదయం 10 గంటలకు సరుకుల కోసం ఖమ్మం పట్టణం వైపు వస్తోన్న ౯ మంది మున్నేరుపై గల ప్రకాష్ బ్రిడ్జివద్దకు రాగానే వరద ఎక్కువ రావడాతో వారు అదే బ్రిడ్జిపై చిక్కుకుపోయారు. వాగులో చిక్కుకున్న 9 మందిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం పోలీసు సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story

Most Viewed