- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: చర్చి, మసీదుల్లో ఆ పని చేసే దమ్ముందా? మహేశ్ కుమార్ గౌడ్ కు బండి సంజయ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ఆలయాల కమిటీలు, ట్రస్ట్ బోర్డుల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని కోరుతూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కు రాసిన లేఖపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అత్యంత పవిత్రమైన దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చవదన్నారు. దేవాలయాలు విశ్వాస స్థలాలని రాజకీయ పునరావాస కేంద్రాలు కావన్నారు. ఈ చర్య వల్ల దేవాలయాల్లోని ఆధ్యాత్మికత దెబ్బతింటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్చిసు, మసీదుల్లో కో ఆర్డినేటర్లను నియమించే దమ్ముందా లేక కేవలం హిందువుల దేవాలయాల్లో మాత్రమే నియమించబోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు దేవాలయాలని పరిరక్షించడం, ఆలయాలపై దాడులను అరికట్టడంపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులను దేవాలయాల్లో రిక్రూట్మెంట్ చేసి ఆలయాల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.