కు.ని ఆపరేషన్‌ బాధితులకు బండి సంజయ్ పరామర్శ

by GSrikanth |
Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధితులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిశారు. కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వల్లనే నలుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు పాతవి కావడంతో ఈ తరహా చిక్కులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story