- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: ‘కాంగ్రెస్ బరితెగించింది.. బీఆర్ఎస్ పనైపోయింది..’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని, మీడియా ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని నిప్పులు చెరిగారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీ క్యాడర్ పోయిందని, లీడర్లు గోడలు దూకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. యూఎస్‌లోని ‘‘ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ ఎన్నారైలతో జరిగిన ఆన్లైన్ మీట్లో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు (మంగళవారం) కరీంనగర్‌లోని తన కార్యాలయంలో బండి సంజయ్ ‘‘ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ ఆన్లైన్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నయ్. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోంది. ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించి కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను దాటవేస్తోంది. సీఎం హామీ ఇస్తే వెంటనే అమలు చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయింది.
కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయింది. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సే.
జాతీయవాద వ్యతిరేక భావజాలమున్న వాళ్లను, నక్సలైట్ సానుభూతి పరులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. వీరంతా మన దేశ చరిత్రను, వివేకానందస్వామి, శివాజీ, వీరసావర్కర్ చరిత్రను కనుమరుగు చేయాలనుకునే వాళ్లే. కమ్యూనిజం, నక్సలిజంకు సానుకూలంగా ఉన్నవాళ్లే. అలాంటి వాళ్లతో విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఏ సంకేతాలు పంపుతున్నారో అర్ధం చేసుకోవాలి. ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాశారంటే.. హిందూ ధర్మంపై ఏ విధమైన దాడి జరుగుతుందో, పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనంలోకి వచ్చి ముఖం చూపించలేక ఫాంహౌజ్ కే పరిమితమైండు. బీఆర్ఎస్ కు క్యాడర్ లేకుండా పోయింది. లీడర్లున్నా వాళ్లంతా ఎప్పుడు ఏ పార్టీలోకి పోదామా? అని గోడమీద పిల్లిలా ఎదురు చూస్తున్నరు. బీఆర్ఎస్ సెక్షన్ మీడియాలో ఏదో పోరాడుతున్నట్లు వార్తలు రాయించుకుని ఆనందపడుతున్నారు. నిజానికి క్యాడర్, లీడర్ తోపాటు ప్రజా సమస్యలపై కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎన్ని కేసులు ఎదురైనా తెగించి కొట్లాడి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే కసితో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఆగడాలపై బీజేపీ కొట్లాడుతుంటే, దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రగతి పథంలోకి తీసుకెళుతుంటే.. ఓర్వలేకపోతున్నరు. ఈ మధ్య దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే వంటి పార్టీలు దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి. దేశాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రభుత్వ ఏర్పాటు చేయడం తథ్యం. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఆలయాలను తీర్చిదిద్దుతాం. ఆదాయం కోసం కాకుండా హిందూ ధర్మం, ధార్మికత, భక్తి భావం పెంపొందేలా ఆలయాల్లో సేవలందిస్తాం’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలంతా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నానని, తద్వారా భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఎన్నారై తన వంతుగా కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్‌లో పర్యటించేలా చేయాలని కోరారు. తద్వారా భారతీయ పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు భారతీయ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.