KCR కు ఇదే చివరి అసెంబ్లీ.. సీఎంగా మళ్లీ కనబడరు: Bandi Sanjay కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-01-22 11:09:29.0  )
KCR కు ఇదే చివరి అసెంబ్లీ.. సీఎంగా మళ్లీ కనబడరు: Bandi Sanjay కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు గిరిజనులు అంటే చులకన అని టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతోన్న గిరిజనుల ప్రతిష్టాత్మక నాగోబా జాతరను కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి బండి సంజయ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నాగోబా జాతర ప్రత్యేకతను ఇక్కడి ఆదివాసులు నలుదిశలా చాటుతున్నారని కొనియాడారు. ప్రతి దాంట్లో దైవాన్ని చూడటమే హిందూ ధర్మమన్నారు. అందరి శుభాల కోసం పూజలందుకునే దేవతే నాగోబా అని అన్నారు. గిరిజనుల ప్రతిష్టాత్మకమైన నాగోబా జాతరకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని బండి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్ చాలా బిజీ అని.. ఆయనకు జాతరకు వచ్చే టైమ్ కూడా లేదని ఎద్దేవా చేశారు. పోడు సమస్యలను కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

చివరకు గ్రామ పంచాయతీ నిధులను కూడా దారి మళ్లీస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాలే తప్ప సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమం పట్టదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఇదే చివరి అసెంబ్లీ అని.. కేసీఆర్ మళ్లీ సీఎంగా ఉండరు.. కనబడరని కీలక బండి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ దివాళా తీసిన కంపెనీ అని.. అందుకే బీఆర్ఎస్ పెట్టారని ఎద్దేవా చేశారు. గిరిజనులంటే చిన్నచూపు చూసే కేసీఆర్.. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గిరిజనులకు ముఖ్యమైన నాగోబా జాతరను కేసీఆర్ విస్మరించారని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట తప్పారని.. తండాలకు కూడా నిధులు ఇవ్వడం లేదని ఫైరయ్యారు.

ఇవి కూడా చదవండి : BRS లో భ‌గ్గుమ‌న్న వ‌ర్గ విబేధాలు.. MLC Kavitha ఎదుటే పోటాపోటీగా నినాదాలు! (వీడియో)

Advertisement

Next Story

Most Viewed