ఉగ్రవాదులకు పాతబస్తీలో MIM స్థావరం కల్పిస్తోంది: బండి సంజయ్

by GSrikanth |   ( Updated:2023-05-10 12:09:28.0  )
ఉగ్రవాదులకు పాతబస్తీలో MIM స్థావరం కల్పిస్తోంది: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉగ్రవాద లింకులపై ఆలోచించాలని రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఉగ్రవాదులకు ఎమ్ఐఎమ్ పార్టీ పాతబస్తీలో స్థావరం కల్పిస్తోందని, అందుకే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఓవైసీ మాట్లాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక, ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది సలీమ్ ఓవైసీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాగా, ఉగ్రవాదం కేసులో పరారీలో ఉన్న మొహమ్మద్ సలీంను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందితో కలిసి హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 5 గురు అనుమానితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మొహమ్మద్ సలీం మాత్రం తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం భోపాల్ తరలించారు. అనంతరం బండి సంజయ్‌ ఈ తరహా కామెంట్లు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


Also Read...

రాష్ట్ర బీజేపీ చీఫ్‌పై ప్రభుత్వం పరువు నష్టం దావా..

Advertisement

Next Story