- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఫాంహౌజ్‌లో ఉండి బీజేపీపై కేసీఆర్ దుష్ర్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఫాంహౌజ్ నుంచి కేసీఆర్ చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని.. ఒప్పందం ప్రకారమే అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను సింగిల్‌గానే ఎదుర్కుంటామని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశతో కాంగ్రెస్ నేతలు అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయడం సాధ్యం కాక చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడటానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. దేశ ప్రగతి, సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. మూడోసారి బీజేపీనే అధికారంలోకి రాబోతోందని అన్నారు. మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని జోస్యం చెప్పారు.