- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే ప్రూవ్ చేయండి.. కాంగ్రెస్ నాయకులకు బండి సంజయ్ సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అయోధ్య రాముడి ఫొటో ఫ్రేమ్‌లను బండి సంజయ్ పంచారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్‌లో కాంగ్రెస్ నేత శశిథరూర్ షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కానీ కాంగ్రెస్ పార్టీ కరసేవకుడినైనా తాను ఫొటో ఫ్రేమ్‌లు పంచడాన్ని తప్పు బడుతోంది. ఫిబ్రవరిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానప్పుడు ఆ ఫొటో ప్రేమ్‌లు పంచాము. ప్రధాని మోడీ, అయోధ్య రామ మందిరం యొక్క అందమైన ఫొటో ఫ్రేమ్‌లను కరీంనగర్‌లో ఇంటింటికి పంచాం.
ప్రజలు సైతం భారీగా ఫొటో ఫ్రేమ్‌లు స్వచ్ఛందంగా తీసుకున్నారు. మోడీ పాపులారిటీ ఎంత ఉందో మీరు కరీంనగర్ వచ్చి చూసుకోండి. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే కోడ్ సమయంలో తాను ఫొటో ఫ్రేమ్‌లను పంచినట్లు రుజువు చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. రాముడితో పాటు ప్రజాస్వామ్యంపై తనకు నమ్మకం ఉందని.. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే మీరంతా నరకానికి పోవడం గ్యారంటీ అన్నారు.