- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన Bandi Sanjay
దిశ, కరీంనగర్: మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కేటీఆర్ స్పందించారంటూ తెలిపారు. మంత్రి సోదరి ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్‌ను చెప్పుతో కొడతానంది అని.. తండ్రి సీఎం కేసీఆర్ నన్ను ఆరు ముక్కలు చేస్తానన్నారు. ఇప్పుడు కేటీఆర్ చెప్పుతో కొడతానంటున్నాడు. కుటుంబం మొత్తానికి డబ్బులు ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారని బండి ఫైర్ అయ్యారు. నేను తంబాకు తింటున్నట్లు ఆరోపణలు చేసినప్పుడు నీ సంస్కారం ఏడబోయిందని ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయట పడ్డాక ఎందుకు ఈ మాట చెప్పలేదంటూ మండి పడ్డారు.
డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయట పెట్టాలన్నారు. వేములవాడకు, ధర్మపురికి ఇస్తామన్న డబ్బులేవీ? పైగా భక్తులిచ్చిన డబ్బులు వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తీగలగుట్టపల్లి వంతెన మీ చుట్టపోడు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నేను వచ్చాకే ఆర్ఓబీ కోసం కేంద్రం వాటాపై ఫైనాన్షియల్ సపోర్టు తెచ్చానన్నారు. రాష్ట్ర వాటా 80 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బీజేపీని బద్నాం చేయాలని ఇప్పుడు కొత్త నాటకమాడుతున్నారని మండిపడ్డారు. బూతులు తిట్టడం తప్ప వీరికి ఏదీ చేతకాదంటూ ఫైర్ అయ్యారు. గంగాధర, తీగలగుట్టపల్లి ఆర్వోబీలు మంజూరయ్యాయని తెలిపారు.
చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదు ?
సెస్ ఎన్నికల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ మాటలు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకే మా పోరాటం అని తెలిపారు. దేవున్నే నమ్మని నాస్తికుడు కేటీఆర్ అన్నాడు. పీసీసీ అధ్యక్షుడు ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ ఆపేసిందని ప్రశ్నించారు. దీని వెనక ఎవరున్నారు? విదేశీ లావాదేవీలు ఎంత జరిగాయో బయటపడుతాయన్నారు. నేను ఏ ఎమ్మెల్యే పేరు డ్రగ్స్ వ్యవహారంలో చెప్పలేదన్నారు. కానీ విచారణలో ఎవరున్నా బయటకు రావాలి? నా పనితీరు అడిగే ముందు.. మీ అయ్య ఇచ్చిన హామీల సంగతేందో చెప్పాలన్నారు. నీ కరాబైన కిడ్నీ వాళ్లేం చేసుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూన్నెళ్ల ట్రీట్ మెంట్ తర్వాత ఇప్పుడు పరీక్షలకు సిద్ధమంటున్నాడని కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.
Read more: