బండి సంజయ్ మరో కీలక నిర్ణయం!

by Nagaya |
బండి సంజయ్ మరో కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు విడుతల పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజల్లోకీ తీసుకువెళ్లడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఐదో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యాత్ర మొదలుకానుంది. గతంలో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ ఈ సారి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించాక నిర్మల్ లోని భైంసా నుంచి యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వైపు పాదయాత్ర చేపడుతూనే పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసే దిశగా బండి సంజయ్ పక్కా ప్లాన్ చేసుకుంటున్నారని 18 నుంచి 20 రోజుల పాటు పాదయాత్రను నిర్వహించాక కరీంనగర్‌లో బహిరంగ సభతో ఐదో విడత పాదయాత్ర ముగిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed