Bandi Sanjay: రాజ్యసభ అభ్యర్థే ప్రత్యక్ష సాక్షి

by Gantepaka Srikanth |
Bandi Sanjay: రాజ్యసభ అభ్యర్థే ప్రత్యక్ష సాక్షి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీఆర్ఎస్‌ల చీకటి ఒప్పందానికి రాజ్యసభ అభ్యర్థే ప్రత్యక్ష సాక్షి అని అన్నారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్, మియాపూర్ భూముల కేసుల్లో బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఎందుకు అరెస్ట్ కావడం లేదని అడిగారు. అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అదానీతో రూ.12,400 కోట్లకు ఒప్పందం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed