- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా’.. కేసీఆర్‌కు బండి సంజయ్ సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సంజయ్ సంచలన సవాల్ విసిరారు. శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. అదే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాస్యం తీసుకుంటారా అని ఛాలెంజ్ చేశారు. హిందువుల మనోభావాలను కేసీఆర్, కేటీఆర్ దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ నోటీ నుండి జై శ్రీరామ్ అనే మాటే రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కంటే ఎక్కువగా దాదాగిరి, గుండాగిరి కేటీఆరే చేశారని అన్నారు. కేటీఆర్ పదేళ్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడి సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో నేతన్నల దీన పరిస్థితికి కేసీఆర్, కేటీఆరే కారణమని దుయ్యబట్టారు. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని, నేతన్నలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. అధికారం పోయాక బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దూషణలకు దిగాయని.. కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా పలు రూపాల్లో దోపిడీకి యత్నిస్తోందని మండిపడ్డారు. మరోసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.