- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: విపక్షాలకు ఆయుధంగా కేసీఆర్ వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై బండి సంజయ్ సీరియస్
దిశ, డైనమిక్ బ్యూరో: దళితబంధు స్కీంలో కొంతమంది ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని అలాంటి వారి జాబితా తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ చేసి కామెంట్స్ సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇది 30 శాతం కమీషన్ సర్కార్ అని విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన బండి సంజయ్ దళిత బంధులో ఎమ్మెల్యేలు చేతివాటం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే కర్ణాటకలోని అధికార బీజేపీని 40 శాతం కమీషన్ సర్కార్ అని బీఆర్ఎస్ నేతలతో సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ కేసీఆర్ సర్కార్ 30 శాతం కమిషన్ అంశం తెరపైకి రావడం హాట్ టాపిక్ అవుతున్నది. సొంత ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే అరికట్టలేని అసమర్థ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
విపక్షాలకు ఆయుధంగా కేసీఆర్ వ్యాఖ్యలు:
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. గురువారం జరిగిన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో కేసీఆర్ పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సమయం లేదని ప్రజా నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. పార్టీ నేతలు పాటించాల్సిన ప్రాధాన్యతలను వివరిస్తూనే తీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని గులాబీ బాస్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారబోతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ సెల్ఫ్ గోల్?:
నిజానికి నిన్నటి పార్టీ మీటింగ్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ అవ్వబోతున్నాయా అనే చర్చ జరుగుతున్నది. గతంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యేల పని తీరు అంతా బాగుందని సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని చెప్పారు. కానీ ఎన్నికల ఏడాదిలో కేసీఆర్ తన స్వరం మార్చారు. కొంత మంది అవినీతికి పాల్పడుతున్నారని, వర్గ పోరు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచించారు. పనితీరు సరిగా లేని వారి తోకలు కట్ చేస్తామని చెప్పడం వెనుక పార్టీ ఎమ్మెల్యే ప్రోగ్రెస్ సరిగా లేదని కేసీఆర్ ఒప్పుకోకనే ఒప్పుకున్నట్లు అయిందని సొంత పార్టీలో చర్చ జరుగుతున్నది. ఈ కామెంట్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల అవినీతి విషయం కేసీఆర్ మాటలు సొంత పార్టీకే డ్యామెజ్ కలిగించబోతున్నాయా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ చేసిన తన వ్యాఖ్యల వెనుక పక్కా వ్యూహం ఉండే ఉంటుందని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీఅర్ఎస్ లో టికెట్ల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హెచ్చరికలు జారీ చేసినా కొన్ని చోట్ల వర్గ విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. దీంతో నేతలను కంట్రోల్ చేయడం కోసమే కేసీఆర్ ఈ రేంజ్ లో వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు ప్రతిపక్షంలోనూ సంచలనంగా మారాయి.