Bandi Sanjay: కాంగ్రెస్ అంటే కమిటీ, కమీషన్, కాలయాపన: ఎక్స్‌లో బండి తీవ్ర విమర్శలు

by Ramesh N |
Bandi Sanjay: కాంగ్రెస్ అంటే కమిటీ, కమీషన్, కాలయాపన: ఎక్స్‌లో బండి తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా #PrashnisthunnaTelangana ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘కాంగ్రెస్ అంటే కమిటీలు, కమీషన్లు, కాలయాపనలు, ధరణిపై కమిటీ, హైడ్రా, మూసీ, ఫోర్త్ సిటీలతో కమీషన్లు, రైతు భరోసాపై కాలయాపన, అలాంటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలో కాదు ఒక యుగం గడిచినా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగు పడదు, సావులు, కన్నీళ్ళే కాంగ్రెస్ కలకాలం నడిచే మార్గం’ అంటూ పేర్కొన్నారు.

Advertisement

Next Story