- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bandi Sanjay: ఆ విషయంలో ప్రజలకు బాగా క్లారిటీ ఇచ్చింది
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ విలీనం, పొత్తుల అంశం గంగలో కలవనీయండని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కోఠిలో మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. పొత్తులు, విలీనం అంశంతో ప్రజలకేం సంబంధమని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని నొక్కి చెప్పారు. రుణమాఫీ అవ్వకుండా రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా అని కేంద్ర సహాయ మంత్రి ప్రశ్నించారు.
రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయని పేర్కొన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని బండి విమర్శలు చేశారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని నిలదీశారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా? అని సంజయ్ నిలదీశారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని బండి విమర్శలు చేశారు.