Bandi Sanjay: ‘బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదు’

by karthikeya |   ( Updated:2024-10-25 07:47:28.0  )
Bandi Sanjay: ‘బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదు’
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదని, పేదల కోసం ఎంతవరకైనా పోరాడతామని, అవసరమైతే రాష్ట్రాన్ని దిగ్భంధిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Central Minister) కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. మూసీ బాధితుల తరపున ఇందిరా పార్క్ (Indira Park) వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మూసీ సుందరీకరణ (Musi Developement)కు లక్షన్నర కోట్లు ఎందుకని బండిసంజయ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్లు మోడీ గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ (Sabarmati river Front) కట్టలేదా..? అని అడుగుతున్నారని, అయితే మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్‌ని రూ.7 వేల కోట్లలో కట్టారని, వేల కిలోమీటర్ల పరిధిలో నిర్వహిస్తున్న నమామి గంగే ప్రాజెక్ట్‌ (Namami Gange Project)కు కేవలం రూ.40 వేల కోట్లేనని, కానీ మూసీకి మాత్రం దేశంలోనే అత్యధికంగా నిధులు ఖర్చుచేయడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు.

‘‘బీఆర్ఎస్‌ (BRS) ఏక్ నిరంజన్ పార్టీ.. అంతా ఒక్కడిగా నడిచింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ (Congress) పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పెద్ద డ్రామా కంపెనీలా తయారైంది’’ అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story

Most Viewed