- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు.. ఆ తర్వాతే పార్టీ ప్రకటన?'
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తోన్న తాంత్రిక పూజల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ధన ప్రవాహం కొనసాగుతుందని విమర్శలు గుప్పించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపణలు చేశారు. పోలీస్, అధికార యంత్రాంగాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దరించడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టలేదని ఎలాంటి జెండా ఎజెండా లేకుండా కేవలం తాంత్రికుడి సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నాడని బండి ఆరోపించారు.