వేలానికి ముందే బాలాపూర్ లడ్డూ అరుదైన రికార్డు

by GSrikanth |
వేలానికి ముందే బాలాపూర్ లడ్డూ అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి వేలం పాటలో 36 మంది పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతేడాది(2022) వేలంలో ఈ లడ్డూ రూ.24.60 పలకగా.. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నేటితో బాలాపూర్ లడ్డూ వేలానికి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. మరోవైపు నగరంలో గణపతి నిమజ్జనాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాథులన్నీ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ 34 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. అనుకోని ప్రమాదాలు జరగకుండా 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు.

Advertisement

Next Story