- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్‌కు మరణమే లేదు: బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సాహసోపేతమైన పథకాలు తెచ్చారు.. సంక్షేమ, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారన్నారు. పేదవాడి ఆకలి తీర్చిన అన్న ఎన్టీఆర్.. భవిష్యత్‌కు బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్ అంటే జాతికి మార్గదర్శకం.. అగ్నికణం అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో నిత్యం ఉంటారని, ఆయన చిరస్మరణీయుడు.. ఆయనకు మరణం లేదన్నారు.
రెండు రూపాయలకు కిలో బియ్యం, వృద్ధులకు పింఛన్లు, చేనేత కార్మికులకు ఉపాధి.. ఇళ్లులేని వారి పక్కా ఇళ్లు.. సామాజిక సంస్కరణ, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. సింగిల్ విండో సిస్టం.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారన్నారు. తెలుగుగంగ, 11వేల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. చరిత్ర మరిచిపోయినవాడు.. తల్లిపాలు తాగి విషం కక్కినట్లే అన్నారు. ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టి వైసీపీలో అసంతృప్తిని చాటారన్నారు. అందరి అభివృద్ధికి కలిసి రావాలని కోరారు.