- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బలగం’ సినిమా ఎఫెక్ట్.. తొమ్మిదేళ్ల తర్వాత మాట్లాడుకున్న అక్కాతమ్ముళ్లు
దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన ‘బలగం’ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కుటుంబ బాంధవ్యాలు, పల్లెటూరి జీవన విధానం, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ సినిమా. అందుకే చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ పెద్ద హిట్ ను అందుకుంది. కాగా బలగం సినిమాను చూసి విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుస్తున్నాయి. ఏళ్ల ఎడబాటు తర్వాత కలుసుకొని అప్యాయంగా పలకరించుకుంటున్నారు కుటుంబ సభ్యులు. కాగా తొమ్మిదేళ్ల కిందట విడిపోయిన ఓ అక్కాతమ్ముళ్లు ‘బలగం’ మూవీ చూసి ఇన్నేళ్లకు మళ్లీ కలుసుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా వనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి, యాదమ్మ అనే అక్కాతమ్ముళ్లు ఓ ఫంక్షన్ లో సారె విషయంలో జరిగిన గొడవ వల్ల తొమ్మిదేళ్ల కిందట విడిపోయారు. ఉండేది ఒకే గ్రామమైన ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా వారు మాట్లాడుకోలేదు. మంచిచెడులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నెల 18న గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో బలగం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాకు గ్రామస్థులతో పాటు యాదమ్మ, భూపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇక సినిమా చూసిన రెండో రోజే తమ్ముడు భూపాల్ రెడ్డి అక్క యాదమ్మ ఇంటికి వెళ్లాడు. అక్క కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత తమ్ముడు తన ఇంటికి రావడంతో అక్క యాదమ్మ కంటి వెంట కన్నీటి ధార కారింది. ఒకరినొకరు హత్తుకొని కన్నీటీ పర్యంతమయ్యారు. అనంతరం ఇంటికి వచ్చిన తమ్ముడికి కడుపు నిండా వండిపెట్టింది అక్క యాదమ్మ.
Also Read..
విడుదలకుముందే ఉత్కంఠ రేపుతున్న ‘పుష్ప 2’.. నార్త్ ప్రేక్షకులు వేయిటింగ్