- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్.. కోర్టు విధించిన షరతులు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: ఐదు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. నేడు సుమారు రెండు గంటలపాటు ఇరువైపుల వాదనలు సుప్రీంకోర్టు విన్నది. దీంతో విచారణ పూర్తి కావడంతో ఓ మహిళగా బెయిల్ కు కవిత అర్హురాలని తేల్చిన కోర్టు ఈడీ, సీబీఐ కేసులో కవితకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఇందుకు రూ.10 లక్షల విలువైన రెండు షూరిటీ సమర్పించాలని, ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయొద్దని, కవిత పాస్‌పోర్ట్‌ను అప్పగించాలి కోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసుపై సుప్రీంకోర్టు మాట్లాడుతూ.. ఇప్పటికే ఈడీ, సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేశాయి. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇక నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నాం., మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.