- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తుతో పాటు ప్రతి సోమవారం సిట్ ముందుకు హాజరుకావాలని హైకోర్టు షరతులు విధించింది. అలాగే ముగ్గురి పాస్ పోర్టులు పోలీసు స్టేషన్ లో సరెండర్ చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు నిమిత్తం మొయినాబాద్ ఫామ్ హౌస్లో రాయబారం సాగిస్తున్న ఈ ముగ్గురిని అక్టోబర్ 29న ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నిన్న హైకోర్టుకు కీలక నివేదికను సమర్పించింది. ఈ కుట్ర అంతా ఢిల్లీలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ఇంట్లోనే జరిగినట్లు సిట్ గుర్తించింది. నిందితుల ఫోన్ లొకేషన్లు అక్కడే ఉన్నట్టు గుర్తించిన సిట్ ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.