సోషల్ మీడియాలో 'దిశ'పై దుష్ప్రచారం.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాజమాన్యం ఫిర్యాదు..

by Kalyani |   ( Updated:2023-01-14 12:16:14.0  )
సోషల్ మీడియాలో దిశపై దుష్ప్రచారం.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాజమాన్యం ఫిర్యాదు..
X

దిశ, ఖైరతాబాద్ 01 : ప్రధాన పత్రికలకు ధీటుగా ప్రజాదరణతో దూసుకెళ్తున్నా 'దిశ' ఎదుగుదలను చూసి ఓర్వలేని కొన్ని దుష్టశక్తులు సోషల్ మీడియా వేదికగా దిశపై దుష్ప్రచారానికి తెరలేపుతున్నాయి. అబద్ధాలతో బురద జల్లుతున్నాయి. వాస్తవాలకు విరుద్ధంగా కారుకూతలు కూస్తున్నాయి. 'రేవంత్ సైన్యం తెలంగాణ', 'రేవంత్ రెడ్డి అన్ అఫీషియల్', 'పాలిటిక్స్' లాంటి రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో దిశకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ పెడుతున్నాయి. దుష్టశక్తులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గిరిధర్ కు దిశ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ శర్మ శనివారం ఫిర్యాదు చేశారు. ప్లాట్ ఫాంలలో ఏయే లింకులతో ఇవి ప్రసారం అవుతున్నాయో (వీడియో క్లిప్పులు, యూఆర్ఎల్ ఐడీలతో సహా) వివరించారు. అవి ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు? ఏ ఐపీ నుంచి అప్లోడ్ చేశారనే విషయాలను గుర్తించి వెంటనే ఆ లింకులను డీయాక్టివేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను గుర్తించి ఇలాంటి దుష్ప్రచారాలు మళ్లీ చేయకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more:

సోషల్ మీడియాలో 'దిశ'పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌‌కు యాజమాన్యం ఫిర్యాదు

Advertisement

Next Story