- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో: మెట్రో రైలు ప్రయాణికులకు నగర మెట్రో సంస్థ భారీ షాక్ ఇచ్చింది. మెట్రో రైళ్లలో ప్రయాణీకులకు రాయితీ కుదింపు చేసినట్లు వెల్లడించింది. స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్‌లకు 10 శాతం రాయితీ ఎల్ అండ్ టీ మెట్రో ఉపసంహరించింది. రోజులో ఆరు గంటలు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని మెలిక పెట్టింది. రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపు చేశారు.
ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు వరకు... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే 10 శాతం రాయితీ ఉంటుందని తెలిపింది. అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాయితీ ఉండదు. రేపటి (ఏప్రిల్ 1) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సూపర్ సేవర్ హాలి డే కార్డును రూ. 59 నుంచి 99 రూపాయలకు పెంపు చేశారు. 99 రూపాయలతో అపరిమితంగా నిర్దేశించిన సెలవురోజుల్లో ప్రయాణాల సౌలభ్యం కల్పిస్తారు.